Actress in Sarkaru Vaari Paata: తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కీర్తి సురేష్ ( Keerthy Suresh ) ఇటీవల తన అభిమానులతో ఆస్క్ మీ ఎనిథింగ్‌ అంటూ ఆన్‌లైన్ చాటింగ్ చేస్తూ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) తదుపరి చిత్రం అయిన సర్కారు వారి పాటలో హీరొయిన్‌గా నటించనున్నట్లు చెప్పుకొచ్చింది. కానీ సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు సరసన జంటగా నటించేది ఎవరనే వివరాలు ప్రొడ్యూసర్స్ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇటీవల, కీర్తి సురేష్ ఈ చిత్రం నుండి తప్పుకుందని, ఆమె స్థానంలో మరో పాపులర్ హీరోయిన్ నటిస్తుందని పలు వార్తలు వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Sarkaru Vaari Paata సినిమాలో హీరోయిన్ గురించి ఈ సినిమా సన్నిహిత వర్గాలు చెప్పిన దాని ప్రకారం సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేయబోతోంది అని తెలుస్తోంది. అంతే కాకుండా యుఎస్‌లో జరగబోయే షూటింగ్ షెడ్యూల్ కోసం కీర్తి సురేష్‌కి వీసా, వర్క్ పర్మిట్ కోసం కూడా చిత్ర యూనిట్ దరఖాస్తు చేసింది అని సమాచారం. అదే కానీ నిజమైతే.. సర్కారు వారి పాటలో మహేష్ బాబు సరసన జంటగా కనిపించబోయే పాపులర్ హీరోయిన్ ఇంకెవరో కాదు.. కీర్తి సురేషే అన్నమాట. Also read : RRR movie: రాజమౌళికి ఆలియా భట్ స్పెషల్ రిక్వెస్ట్


మైత్రి మూవీ మేకర్స్, మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ బ్యానర్లు సంయుక్తంగా సర్కారు వారి పాట సినిమాని నిర్మిస్తుండగా గీత గోవిందం ఫేమ్ పరశురాం ( Parasuram ) ఈ సినిమాని డైరక్ట్ చేస్తున్నాడు. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు.


కీర్తి సురేష్ అప్‌కమింగ్ మూవీస్ విషయానికొస్తే.. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ 'గుడ్ లక్ సఖి' సినిమా టీజర్ ( Good luck sakhi teaser ) ఆగష్టు 15న విడుదలైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం OTTలో విడుదల కానుంది అని టాక్ వినిపిస్తోంది. Also read : Kajal Aggarwal wedding: కాజల్ అగర్వాల్ పెళ్లి వాయిదా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe